పఠాన్ కోట్పై దాడిని తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చైనా పేర్కొంది. ఈ దాడి వల్ల భారతీయులకు కలిగిన ఆవేదనను, ఆవేశాన్ని తాము కూడా పంచుకుంటున్నామని చైనా వెల్లడించింది.
బీజింగ్: పఠాన్ కోట్పై దాడిని తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చైనా పేర్కొంది. ఈ దాడి వల్ల భారతీయులకు కలిగిన ఆవేదనను, ఆవేశాన్ని తాము కూడా పంచుకుంటున్నామని చైనా వెల్లడించింది. 'చైనా కూడా ఒక ఉగ్రవాద బాధితురాలే. మేం భారతీయుల బాధను పంచుకుంటున్నాం. ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దానిని మేం తీవ్రంగా ఖండిస్తాం.. వ్యతిరేకిస్తాం' అని చైనా భారత రాయభారి లీ యూచెంగ్ అన్నారు.
దాడి జరిగిన పఠాన్ కోట్ ప్రాంతాన్ని ప్రధాని నరేంద్రమోదీ సందర్శించిన కొద్ది సేపటితర్వాత చైనా తరుపున ఈ ప్రకటన రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి భారత్ కు అనుకూలంగా ఉన్నట్లు ప్రవర్తించినా.. వెనుకనుంచి అది పాకిస్థాన్కే అధిక మద్దతు ఇస్తుందని, పరోక్షంగా భారత్ను ఇరుకున పడేసి చర్యలకు సహకరిస్తుందని అపవాదు చైనాపై ఉన్న విషయం తెలిసిందే.