పిల్లలు అందుకే ముద్దొస్తారు! | children Evolved to trigger our 'caregiving' behaviour | Sakshi
Sakshi News home page

పిల్లలు అందుకే ముద్దొస్తారు!

Jun 7 2016 3:51 PM | Updated on Sep 4 2017 1:55 AM

పిల్లలు అందుకే ముద్దొస్తారు!

పిల్లలు అందుకే ముద్దొస్తారు!

చిన్న పిల్లల్ని చూస్తే ఎవరికైనా దగ్గరకు తీసుకోవాలనిపిస్తోంది.

లండన్: చిన్న పిల్లల్ని చూస్తే ఎవరికైనా దగ్గరకు తీసుకోవాలనిపిస్తోంది. వాళ్లను మద్దు చేయాలనిపిస్తుంది. వారి పెద్దపెద్ద కళ్లు, పాల బుగ్గలు, బోసినవ్వు  వీటన్నింటిలో ఉన్న ఆకర్షణను వర్ణించలేము. అయితే ఈ ఆకర్షణ వెనుకాల పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.

సాధారణంగా చిన్న పిల్లలకు పెద్దవారి నుంచి ఎక్కువ సంరక్షణ అవసరం. ప్రతీ అంశంలో వారి అవసరాలను పెద్దవారే గుర్తించి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పెద్దవారి నుంచి ఈ అదనపు కేర్ను పొందటానికి.. చిన్నపిల్లలు ఆకర్షణగా కనిపించే అంశం దోహదం చేస్తుందని ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ క్రింగల్బాచ్ తెలిపారు. పురుషులు, స్త్రీలు అనే భేదం లేకుండా పిల్లలు అందరినీ ఆకర్షించడానికి కారణం వారికి కావాల్సిన 'సంరక్షణ' అని పరిశోధకులు వెల్లడించారు. చిన్నపిల్లలు చేసే శబ్దాలు, కదలికలు లాంటివి సైతం పెద్దవారిని ఆకర్షించేలా ఉండటానికి కారణం ఇదేనన్నారు. జీవపరిణామంలో సైతం 'క్యూట్నెస్' అనే అంశం రక్షణ విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ ఫలితాలను 'ట్రెండ్స్ ఇన్ కాగ్నిటీవ్ సైన్సెస్' జర్నల్లో ప్రచురించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement