breaking news
evolved
-
గబ్బిలాల పుట్టినిల్లు ఐరోపానే!
జీవ పరిణామ క్రమంలో అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచే సంచలన విషయాన్ని శాస్త్రవేత్తలు బహిర్గతం చేశారు. గబ్బిలాలు సుమారు 6.5 కోట్ల (65 మిలియన్లు) సంవత్సరాల క్రితం ఐరోపా ఖండంలోనే మొదటగా పరిణామం చెందాయని ‘నేచర్’ అంతర్జాతీయ పరిశోధనా పత్రికలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఇప్పటివరకు ఆసియా, ఆఫ్రికా లేదా ఉత్తర అమెరికా ఖండాల్లో గబ్బిలాలు ఉద్భవించాయనే అంచనాలను ఈ అధ్యయనం పటాపంచలు చేసింది.ప్రాజెక్ట్ ‘బ్యాట్1కే’ విజయం‘Bat1K’ కన్సోర్టియమ్ నేతృత్వంలో 64 దేశాలకు చెందిన 137 మంది జీవశాస్త్రవేత్తలు దాదాపు దశాబ్ద కాలం పాటు శ్రమించి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. ప్రఖ్యాత పరిశోధకులు ఎమ్మా టీలింగ్, నెన్సీ సిమ్మన్స్ వంటి ప్రముఖుల భాగస్వామ్యంతో జరిగిన ఈ పరిశోధనలో ప్రస్తుతం ఉన్న 21 గబ్బిలాల వర్గాలకు చెందిన 103 రకాల జీవుల సంపూర్ణ జెనోమ్ (డీఎన్ఏ)ను సీక్వెన్సింగ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా లభించిన 44 ప్రాచీన శిలాజాల డేటాతో ఈ జన్యు సమాచారాన్ని సరిపోల్చారు.ఐరోపా నుంచి ప్రపంచవ్యాప్త విస్తరణఈ జెనోమిక్ విశ్లేషణ ప్రకారం, డైనోసార్లు అంతరించిన కాలం (సుమారు 6.5 కోట్ల ఏళ్ల క్రితం)లో ఐరోపాలో మొదటిసారిగా గబ్బిలాలు పుట్టాయి. అక్కడ నుంచి ముందుగా ఆఫ్రికాకు చేరుకుని ‘యూరో-ఆఫ్రికా హబ్’గా మారాయి. ఆ తర్వాత కాలంలో ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలకు విస్తరించాయని జన్యు మ్యాపింగ్ స్పష్టం చేస్తోంది.ఎకోలొకేషన్.. ఎగిరే సామర్థ్యంక్షీరదాల్లో సజావుగా ఎగరగల ఏకైక జీవి గబ్బిలమే(రెక్కలతో నిజమైన విమానంలా స్వయంగా ఎగరలిగే శక్తి గబ్బిలానికి మాత్రమే ఉంది. ఇతర జీవివులు గాల్లో తేలుతూ ఎగురుతాయి). చీకట్లో శబ్ద తరంగాల ద్వారా మార్గాన్ని గుర్తించే ఎకోలొకేషన్ సామర్థ్యం, ఎగిరే నైపుణ్యం రెండూ గబ్బిలాల పరిణామ క్రమం ఆరంభంలోనే రూపుదిద్దుకున్నాయని ఈ పరిశోధన తేల్చింది.మానవ వైద్య రంగానికి కీలకంగబ్బిలాలు అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లను మోస్తూ కూడా అనారోగ్యానికి గురికావు. అలాగే వాటి పరిమాణంతో పోలిస్తే సుదీర్ఘకాలం జీవిస్తాయి. కొత్తగా రూపొందించిన ఈ పూర్తిస్థాయి క్రోమోజోమ్ మ్యాపింగ్ ద్వారా గబ్బిలాల్లో ఉన్న రోగనిరోధక శక్తి, క్యాన్సర్ నిరోధక జన్యువులు, వృద్ధాప్యాన్ని అడ్డుకునే కణ వ్యవస్థలపై లోతైన పరిశోధనలకు బాటలు పడింది. ఇది భవిష్యత్తులో మానవ వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న నటులు వీరే.. -
మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ ఎవాల్వ్ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: పూర్తిగా భారత్‌లో ఉత్పత్తి అయిన రెండు అధునాతన స్మార్ట్ఫోన్లను ప్రీమియం బ్లాక్‌బెర్రీ గురువారం మార్కెట్లో విడుదలచేసింది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్, 5.99 అంగుళాల డిస్ప్లేతో ఈ రెండు ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లు భారత్‌లో బ్లాక్‌బెర్రీ మొబైల్స్‌ను ఉత్పత్తి చేస్తున్న ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ తెలిపింది. ఎవాల్వ్ ఎక్స్ పేరిట విడుదలైన మొబైల్ ధర రూ.34,990 కాగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత స్టోరేజీ స్పెషల్ ఫీచర్స్‌గా ఉన్నట్లు వెల్లడించింది. ఎవాల్వ్ ధర రూ.24,990గా నిర్ణయించింది. ఈ నెలాఖరులో ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది. -
పిల్లలు అందుకే ముద్దొస్తారు!
లండన్: చిన్న పిల్లల్ని చూస్తే ఎవరికైనా దగ్గరకు తీసుకోవాలనిపిస్తోంది. వాళ్లను మద్దు చేయాలనిపిస్తుంది. వారి పెద్దపెద్ద కళ్లు, పాల బుగ్గలు, బోసినవ్వు వీటన్నింటిలో ఉన్న ఆకర్షణను వర్ణించలేము. అయితే ఈ ఆకర్షణ వెనుకాల పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. సాధారణంగా చిన్న పిల్లలకు పెద్దవారి నుంచి ఎక్కువ సంరక్షణ అవసరం. ప్రతీ అంశంలో వారి అవసరాలను పెద్దవారే గుర్తించి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పెద్దవారి నుంచి ఈ అదనపు కేర్‌ను పొందటానికి.. చిన్నపిల్లలు ఆకర్షణగా కనిపించే అంశం దోహదం చేస్తుందని ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ క్రింగల్బాచ్ తెలిపారు. పురుషులు, స్త్రీలు అనే భేదం లేకుండా పిల్లలు అందరినీ ఆకర్షించడానికి కారణం వారికి కావాల్సిన 'సంరక్షణ' అని పరిశోధకులు వెల్లడించారు. చిన్నపిల్లలు చేసే శబ్దాలు, కదలికలు లాంటివి సైతం పెద్దవారిని ఆకర్షించేలా ఉండటానికి కారణం ఇదేనన్నారు. జీవపరిణామంలో సైతం 'క్యూట్‌నెస్' అనే అంశం రక్షణ విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ ఫలితాలను 'ట్రెండ్స్ ఇన్ కాగ్నిటీవ్ సైన్సెస్' జర్నల్‌లో ప్రచురించారు.


