మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ ఎవాల్వ్‌ స్మార్ట్‌ఫోన్‌

BlackBerry Evolve smartphone into the market - Sakshi

ధరల శ్రేణి రూ.24,990–34,990 

న్యూఢిల్లీ: పూర్తిగా భారత్‌లో ఉత్పత్తి అయిన రెండు అధునాతన స్మార్ట్‌ఫోన్లను ప్రీమియం బ్లాక్‌బెర్రీ గురువారం మార్కెట్‌లో విడుదలచేసింది. ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఓఎస్, 5.99 అంగుళాల డిస్‌ప్లేతో ఈ రెండు ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లు భారత్‌లో బ్లాక్‌బెర్రీ మొబైల్స్‌ను ఉత్పత్తి చేస్తున్న ఆప్టిమస్‌ ఇన్‌ఫ్రాకామ్‌ తెలిపింది.

ఎవాల్వ్‌ ఎక్స్‌ పేరిట విడుదలైన మొబైల్‌ ధర రూ.34,990 కాగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత స్టోరేజీ స్పెషల్‌ ఫీచర్స్‌గా ఉన్నట్లు వెల్లడించింది. ఎవాల్వ్‌ ధర రూ.24,990గా నిర్ణయించింది. ఈ నెలాఖరులో ఫోన్లు  అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top