నేర చరిత్ర పరిశీలించాకే బ్రిటన్‌ వీసాలు | Sakshi
Sakshi News home page

నేర చరిత్ర పరిశీలించాకే బ్రిటన్‌ వీసాలు

Published Sat, Mar 18 2017 4:46 AM

నేర చరిత్ర పరిశీలించాకే బ్రిటన్‌ వీసాలు - Sakshi

లండన్‌: బ్రిటన్‌లో పనిచేయాలనుకునే ఉపాధ్యాయులు, నర్సులు, సామాజిక కార్యకర్తలు టైర్‌–2 వీసాకు దరఖాస్తు సమయంలో వారిపై ఎలాంటి నేరచరిత్ర లేదని చూపే పత్రాల్ని తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. నాన్‌ ఈయూ దేశాలకు వర్తించే ఈ నిబంధనను ఏప్రిల్‌ నుంచి అమల్లోకి తేవాలని బ్రిటన్‌ భావిస్తుంది. అందుకనువుగా త్వరలో పార్లమెంట్‌ ఆమోదానికి పంపనుంది.

అలాగే చిన్నారులు, అనారోగ్యంతో ఉన్న పెద్దలకు సేవ చేయాలని వచ్చేవారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. గత పదేళ్లుగా నివసిస్తున్న దేశంలో వారిపై ఎలాంటి నేర చరిత్ర లేదని అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని వీసా దరఖాస్తు సమయంలో సమర్పించాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement