బ్రెజిల్‌తో భారత్ ఎంవోయూ | brazil mou with india on Cattle , buffalo productivity improvement | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌తో భారత్ ఎంవోయూ

Nov 15 2015 9:48 AM | Updated on Sep 3 2017 12:32 PM

పశువులు, గేదెల ఉత్పాదకత పెంపు కోసం భారతదేశం, బ్రెజిల్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

న్యూఢిల్లీ: పశువులు, గేదెల ఉత్పాదకత పెంపు కోసం భారతదేశం, బ్రెజిల్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. రెండు దేశాల వ్యవసాయశాఖ మంత్రుల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరస్పర ప్రయోజనాల కోసం అవకాశం ఉన్న రంగాలపై  కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, బ్రెజిల్ మంత్రి కటియా అబ్య్రూ చర్చించారు.

 

గేదెలు, పశువుల ఉత్పాదకత అభివృద్ధి కోసం నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్(ఎన్‌డీడీబీ), ఈఎమ్‌బీఆర్‌ఏపీఏ మధ్య ఎంవోయూ కుదిరింది. ఇరు దేశాల మధ్య పరస్పర సహకార ఒ ప్పందాలు శిఖర స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఓ ప్రకటనలో తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement