భారీ పేలుడు: 76 మంది మృతి | Blast In Somalia Capital City | Sakshi
Sakshi News home page

భారీ పేలుడు: 76 మంది మృతి

Dec 28 2019 7:01 PM | Updated on Dec 28 2019 7:01 PM

Blast In Somalia Capital City - Sakshi

మొగదిషు : సొమాలియాలో ఉగ్రవాదుల రక్తపాతం సృష్టించారు. రాజధాని మొగదిషులో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో 76 మంది మృతి చెందారు. నగరానికి చెందిన ఓ చెక్‌ పాయింట్‌ సమీపంలో  శక్తివంతమైన పేలుడు జరిగింది. దీంతో అక్కడున్న వారంత మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటన పట్ల ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు.

సొమాలియాలో సాధారణంగా ఆల్‌ఖయిదా అనుబంధ సంస్థ అల్‌ షబాబ్‌ తరుచూ ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సుమారు 76 మంది మృతదేహాలను వెలికితీసినట్లు ఆమిన్‌ అంబులెన్స్‌ డైరక్టర్‌ అబ్దుల్‌కాదిర్‌ అదన్‌ తెలిపారు. ఇంకా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. మృతిచెందినవారిలో విద్యార్థులు, పోలీసు ఆఫీసర్లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement