కాల్పుల ఘటనపై రణతుంగ అరెస్ట్‌ | Arjuna Ranatunga Arrested Over Shooting Incident | Sakshi
Sakshi News home page

కాల్పుల ఘటనపై రణతుంగ అరెస్ట్‌

Oct 29 2018 8:02 PM | Updated on Nov 9 2018 6:46 PM

Arjuna Ranatunga Arrested Over Shooting Incident - Sakshi

కాల్పుల ఘటనలో లంక క్రికెట్‌ దిగ్గజం అర్జున రణతుంగ అరెస్ట్‌

కొలంబో : తన కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం, మంత్రి అర్జున రణతుంగను  పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. కొలంబో క్రైమ్‌ పోలీసులు రణతుంగను అరెస్ట్‌ చేశారని, ఆయనను కోర్టులో హాజరుపరుస్తారని పోలీసు ప్రతినిధి రువాన్‌ గుణశేఖర పేర్కొన్నారు. విక్రమ సింఘేను ప్రధాని పదవి నుంచి తొలగించిన  శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మహింద్ర రాజపక్సెను ప్రధానిగా నియమించిన సంగతి తెలిసిందే.

నూతన ప్రధాని మహింద్ర రాజపక్సెతో సన్నిహితంగా మెలిగే కార్మిక సంఘాల నేతలు రద్దయిన కేబినెట్‌ మంత్రులను వారి కార్యాలయాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. రణతుంగ ఆదివారం తన కార్యాలయంలోకి ప్రవేశిస్తుండగా కొందరు అడ్డుకోవడంతో సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement