బోటు బోల్తా : 42 మంది మృతి | 42 killed in migrant boat capsize off Egypt's coast | Sakshi
Sakshi News home page

బోటు బోల్తా : 42 మంది మృతి

Sep 22 2016 11:41 AM | Updated on Jul 11 2019 6:15 PM

బోటు బోల్తా : 42 మంది మృతి - Sakshi

బోటు బోల్తా : 42 మంది మృతి

ఈజిప్టు మధ్యధరా సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది.

కైరో : ఈజిప్టు మధ్యధరా సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. శరణార్థులను తీసుకు వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. 400 మంది గల్లంతు అయ్యారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదం కర్ఫ్ ఎల్ షేక్ వద్ద చోటు చేసుకుందని... ఈ ప్రమాదం జరిగిన సమయంలో 600 మంది శరణార్థులు బోటులో ఉన్నారని చెప్పారు.

వారంతా ఈజిప్టియన్లు, సరియన్లు, సుడాన్ వాసులు, సోమాలియాకు చెందిన వారని వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బోటులో ప్రయాణిస్తున్న 150 మందిని కోస్ట్ గార్డు సిబ్బంది కాపాడరని పేర్కొన్నారు. వారిని రషిద్ నగరంలోని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement