థాయ్‌లో బోటు బోల్తా 37 మంది మృతి | 37 dead, 18 unaccounted for in Thai tourist boat capsize | Sakshi
Sakshi News home page

థాయ్‌లో బోటు బోల్తా 37 మంది మృతి

Jul 7 2018 3:16 AM | Updated on Apr 3 2019 5:24 PM

37 dead, 18 unaccounted for in Thai tourist boat capsize  - Sakshi

ఫుకెట్‌: పర్యాటకులకు స్వర్గధామమైన థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుకెట్‌ దీవికి సమీపంలో 105 మందితో గురువారం సముద్రంలోకి వెళ్లిన బోటు బోల్తా కొట్టడంతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 50 మంది పర్యాటకుల్ని అధికారులు రక్షించగలిగారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి 16 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడటంతో ఫీనిక్స్‌ అనే బోటు గురువారం పల్టీ కొట్టిందని ఫుకెట్‌ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. అలలు ఎగిసిపడే అవకాశముందని హెచ్చరించినప్పటికీ బోటు యజమాని, కెప్టెన్‌ తమ సూచనల్ని పెడచెవిన పెట్టారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారంతా చైనీయులే.

Advertisement
 
Advertisement
Advertisement