ఘోర రైలు ప్రమాదం.. | 15 killed, 40 injured as trains collide in Pakistan | Sakshi
Sakshi News home page

ఘోర రైలు ప్రమాదం..

Nov 3 2016 11:01 AM | Updated on Sep 4 2017 7:05 PM

ఘోర రైలు ప్రమాదం..

ఘోర రైలు ప్రమాదం..

పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.

కరాచి: పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గడ్డాఫి పట్టణం లంధి ప్రాంతంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తప్పుడు సిగ్నల్ కారణంగా ఫరీద్ ఎక్స్‌ప్రెస్, జకారియా ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో జకారియా ఎక్స్‌ప్రెస్ మూడు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

గాయపడిన వారిని సహాయక బృందాలు సమీపంలోని జిన్నా, అబ్బాసీ ఆసుపత్రులకు తరలించాయి. సెప్టెంబర్‌లో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 150 మంది గాయపడిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement