భారత సీరియల్ కథపై బంగ్లాలో కొట్లాట | 100 bangladesh villagers injured after tv show dispute | Sakshi
Sakshi News home page

భారత సీరియల్ కథపై బంగ్లాలో కొట్లాట

Aug 20 2016 1:37 AM | Updated on Sep 4 2017 9:58 AM

భారత సీరియల్ కథపై బంగ్లాలో కొట్లాట

భారత సీరియల్ కథపై బంగ్లాలో కొట్లాట

బంగ్లాదేశ్‌లో ప్రసారమవుతున్న ఓ భారతీయ బెంగాలీ టీవీ సీరియల్‌పై అక్కడి గ్రామస్తుల మధ్య మొదలైన చిన్న గొడవ చివరికి 100 మందిని గాయాలపాలు చేసింది.

ఢాకా: బంగ్లాదేశ్‌లో ప్రసారమవుతున్న ఓ భారతీయ బెంగాలీ టీవీ సీరియల్‌పై అక్కడి గ్రామస్తుల మధ్య మొదలైన చిన్న గొడవ చివరికి 100 మందిని గాయాలపాలు చేసింది. హబీగంజ్ జిల్లా ధోల్ గ్రామంలోని ఓ రెస్టారెంట్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రేతాత్మ నుంచి ప్రజలను కాపాడుకునే ఓ రాణి కథ ఇతివృత్తంగా తీసిన ‘కిరన్మాలా’ సీరియల్ వీరంతా చూస్తున్నారు. కథపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తర్వాత అక్కడివారంతా వాగ్వాదానికి దిగారు. చివరికి రెస్టారెంట్‌ను ధ్వంసం చేసి కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. గురువారం ఉదయం వరకు గొడవ కొనసాగింది. పోలీసులు అక్కడికొచ్చి బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి వారిని చెదరగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement