breaking news
Pandemonium
-
విమానంలో ఇలా కట్టేశారు.. అసలేం జరిగిందంటే..?
వేల అడుగుల ఎత్తులో గాల్లో ప్రయాణిస్తున్న విమానం.. ఒక్కసారిగా ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. తోటి ప్రయాణికుడిపై దాడికి దిగడంతో విమానంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చివరకు అతడిని జిప్ టైలు, హ్యాండ్కఫ్లతో బంధించి.. డక్ట్ టేప్‌తో సీటుకే కట్టేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు. బాల్టిమోర్‌లో ల్యాండ్ చేశారు.స్థానిక మీడియా సమాచారం.. విమానం ప్రయాణం ప్రారంభమైన సుమారు రెండు గంటల తర్వాత ఆ ప్రయాణికుడు అకస్మాత్తుగా దూకుడుగా ప్రవర్తించడం ప్రారంభించాడు. విమాన సిబ్బందిపై అరుస్తూ, తన పక్కన కూర్చున్న మరో ప్రయాణికుడిపై దాడి చేశాడు. అతడి ప్రవర్తనతో విమానంలోని ఇతర ప్రయాణికుల ఆందోళన చెందారు.ఓ ప్రయాణికుడు మీడియాతో మాట్లాడుతూ ఘటన ఒక్కసారిగా చోటుచేసుకుందని తెలిపారు. అంతా ప్రశాంతంగా ఉండగా.. ఒక్కసారిగా అరుపులు, గందరగోళ పరిస్థితి నెలకొంది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి, ఓ వ్యక్తి.. అతడి పక్కన కూర్చున్న వ్యక్తి మెడ చుట్టూ చేతులు వేసి దాడి చేశాడని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది.. జిప్ టైలు, ఫ్లెక్సిబుల్ హ్యాండ్ కఫ్‌లతో అతడిని కట్టేశారు.ఇదీ చదవండి: రోడ్డు కింద 20 వేల పాత టైర్లు.. ఎందుకు పాతిపెట్టారంటే?అతడు మళ్లి దాడికి పాల్పడకుండా ఫస్ట్ క్లాస్ సీటుకు డక్ట్ టేప్‌తో శరీరాన్ని బిగించి ఉంచారు. ఘటనపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. విమానం చివరకు సురక్షితంగా నెవార్క్లో ల్యాండ్ అయింది. అనంతరం అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఈ ఘటనను ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపట్టింది. -
భారత సీరియల్ కథపై బంగ్లాలో కొట్లాట
-
భారత సీరియల్ కథపై బంగ్లాలో కొట్లాట
ఢాకా: బంగ్లాదేశ్‌లో ప్రసారమవుతున్న ఓ భారతీయ బెంగాలీ టీవీ సీరియల్‌పై అక్కడి గ్రామస్తుల మధ్య మొదలైన చిన్న గొడవ చివరికి 100 మందిని గాయాలపాలు చేసింది. హబీగంజ్ జిల్లా ధోల్ గ్రామంలోని ఓ రెస్టారెంట్లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రేతాత్మ నుంచి ప్రజలను కాపాడుకునే ఓ రాణి కథ ఇతివృత్తంగా తీసిన ‘కిరన్మాలా’ సీరియల్ వీరంతా చూస్తున్నారు. కథపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తర్వాత అక్కడివారంతా వాగ్వాదానికి దిగారు. చివరికి రెస్టారెంట్‌ను ధ్వంసం చేసి కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. గురువారం ఉదయం వరకు గొడవ కొనసాగింది. పోలీసులు అక్కడికొచ్చి బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి వారిని చెదరగొట్టారు.


