
ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు...:అంబటి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్ :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...'చంద్రబాబు సర్కార్ ప్రచార ఆర్భాటాలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజా ప్రయోజనాలకు ఇవ్వడం లేదు. అందుకు పట్టిసీమే ఉదాహరణ.
ఎన్టీఆర్ సుజల స్రవంతిని గాలికొదిలేశారు. నారావారి సారా స్రవంతిని మాత్రం దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు...అవినీతి ప్రదేశ్. చంద్రబాబు విజన్ 2020 అంటే ఇదేనా?. కమీషన్ల కోసం కాపురాలు కూల్చొద్దు. చంద్రబాబుని మందుబాబు అని పిలిచే పరిస్థితులు వస్తున్నాయి' అని అన్నారు.