ప్రారంభమైన వైఎస్ఆర్ సీపీ సమావేశం | ysrcp meeting begin in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన వైఎస్ఆర్ సీపీ సమావేశం

Jul 4 2016 12:43 PM | Updated on Jul 25 2018 4:09 PM

ప్రారంభమైన వైఎస్ఆర్ సీపీ సమావేశం - Sakshi

ప్రారంభమైన వైఎస్ఆర్ సీపీ సమావేశం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ సీపీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ సీపీ కార్గవర్య సమావేశం ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు పాల్గొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి రోజైన ఈ నెల 8వ తేదీ నుంచి  రాష్ట్రంలో చేపట్టనున్న గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్లే విషయంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే పార్టీ శ్రేణులకు జగన్మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement