వడ్డేపల్లికి నివాళులర్పించిన వైసీపీ నేతలు | YSR Congress leaders condolence to Vaddepalli Narsing rao death | Sakshi
Sakshi News home page

వడ్డేపల్లికి నివాళులర్పించిన వైసీపీ నేతలు

May 23 2014 11:57 AM | Updated on May 25 2018 9:17 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డేపల్లి నర్సింగరావు భౌతికాయాన్ని శుక్రవారం ఆ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పీఎన్వీ ప్రసాద్, జూపల్లి సందర్శించి నివాళులర్పించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డేపల్లి నర్సింగరావు భౌతికాయాన్ని శుక్రవారం ఆ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పీఎన్వీ ప్రసాద్, జూపల్లి సందర్శించి నివాళులర్పించారు. నర్సింగరావు భౌతిక కాయానికి నివాళులర్పించిన వారిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్రావు, కేటీఆర్లతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణరావు కూడా ఉన్నారు.



వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డేపల్లి నర్సింగరావు (64) అనారోగ్యంతో మృతి చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడుగా మెలిగిన వడ్డేపల్లి నర్సింగరావు  2005లో  రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పని చేశారు. కాగా వడ్డేపల్లి మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు.  వడ్డేపల్లి కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడిన విషయం విదితమే.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement