ఇస్రో మరో మైలురాయిని దాటింది: వైఎస్ జగన్‌ | ys jaganmohanreddy congratulates isro scientists for successful launch of pslv c29 | Sakshi
Sakshi News home page

ఇస్రో మరో మైలురాయిని దాటింది: వైఎస్ జగన్‌

Dec 16 2015 8:21 PM | Updated on May 29 2018 4:26 PM

ఇస్రో మరో మైలురాయిని దాటింది: వైఎస్ జగన్‌ - Sakshi

ఇస్రో మరో మైలురాయిని దాటింది: వైఎస్ జగన్‌

పీఎస్‌ఎల్వీ సీ-29 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

హైదరాబాద్: పీఎస్‌ఎల్వీ సీ-29 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. శ్రీహరికోట షార్‌ కేంద్రం నుంచి నింగికి ఎగిరిన పీఎస్‌ఎల్వీ సీ-29 రాకెట్‌ సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

ఈ ఘనతను దిగ్విజయంగా పూర్తిచేసిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని వైఎస్‌ జగన్‌ కొనియాడారు. ఈ వాణిజ్య ప్రయోగం ద్వారా దేశానికి సంపదను అందివ్వడమే కాకుండా అంతరిక్ష సాంకేతిక పరిశోధనలో మరో మైలురాయిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధిగమించిందని ఆయన ప్రశంసించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement