రేపు ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖి | Ys jagan mohan reddy to video confernce on sept 25, 2016 | Sakshi
Sakshi News home page

రేపు ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖి

Sep 24 2016 1:57 AM | Updated on Jul 25 2018 4:09 PM

రేపు ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖి - Sakshi

రేపు ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్న ప్రతిపక్ష నేత
  ‘హోదా’ ఆవశ్యకతను వివరించనున్న వైఎస్సార్‌సీపీ అధినేత

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 25వ తేదీన ప్రవాసాంధ్రులతో ముఖాముఖీ చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉధృతంగా పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రవాసాంధ్రులతో జగన్ నేరుగా మాట్లాడతారు.

ప్రపంచవ్యాప్తంగా ఐదుచోట్ల నుంచి ఎన్నారైలు.. వైఎస్ జగన్‌తో ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేశారు. సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అలాగే డిజిటల్ మాధ్యమంలో సాక్షి యూట్యూబ్ చానల్ Https://youtu.be/k4kM4PVNt8l లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. ఎన్నారైలు ఏర్పాటు చేసుకున్న https://www.youtube.com/channel/UC4oQR_IibE2AK_h78czulrQ లింకు ద్వారా కూడా దీన్ని వీక్షించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement