అవన్నీ సర్కారీ హత్యలే! | ys jagan mohan reddy takes on tdp government on political murders | Sakshi
Sakshi News home page

అవన్నీ సర్కారీ హత్యలే!

Aug 19 2014 2:25 AM | Updated on Aug 18 2018 5:15 PM

అవన్నీ సర్కారీ హత్యలే! - Sakshi

అవన్నీ సర్కారీ హత్యలే!

వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల, నేతల హత్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తున్నవేనని, అందుకే ఆంధ్రప్రదేశ్‌లోని శాంతిభద్రతల పరిస్థితిపై చర్చ జరగాలని తాము పట్టుబడుతున్నామని ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

అందుకే చర్చకు పట్టుబడుతున్నాం: జగన్‌మోహన్‌రెడ్డి 
 ఎన్నికల అనంతరం 11 మందిని కిరాతకంగా చంపారు

* పోలీసులు నివారించకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు
* శాంతిభద్రతలపై చర్చ కోరితే అందుకు తావివ్వలేదు
* మనుషుల ప్రాణాలకన్నా విలువైనవి ఏముంటాయి?
* పరిటాల హత్య కేసులో బాబు ఆరోపణలు దారుణం
* వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ ప్రశ్నలు

 
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల, నేతల హత్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తున్నవేనని, అందుకే ఆంధ్రప్రదేశ్‌లోని శాంతిభద్రతల పరిస్థితిపై చర్చ జరగాలని తాము పట్టుబడుతున్నామని ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఎన్నికల అనంతరం ఇప్పటికి రాష్ట్రంలో 11 మందిని కిరాతకంగా హతమర్చారు. ఈ హత్యలను ఆపాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయి. ఈ అంశంపై చర్చకు మేం వాయిదా తీర్మానం ఇస్తే.. చర్చకు తావివ్వలేదు.
 
శాసనసభలో చర్చించడానికి ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఉందా? బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఇంకా రెండు రోజుల సమయముంది. బడ్జెట్ సందర్భంగా ఎలాగూ రుణ మాఫీ తదితర అంశాల గురించి మాట్లాడతాం. అయితే.. అంతకంటే ముందు మనుషుల ప్రాణాలు పోతున్న విషయంపై చర్చిం చాలని కోరుతున్నాం. మనుషుల ప్రాణాల కన్నా విలువైనవి ఏముంటాయి?’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజు సభ వాయిదా పడిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తన చాంబర్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
 
హత్యలకు పోలీసులు మద్దతిస్తున్నారు...
హత్యలు జరుగుతుంటే ఆపాల్సిన పోలీసులు.. తమ విధులు నిర్వర్తించకపోగా ఆ హత్యలకు మద్దతునిస్తున్నారని, సాక్షాత్తూ స్పీకర్ నియోజకవర్గంలోనే ఎంపీటీసీలను అపహరించుకుని వెళ్లారని, తమ పార్టీ ఎమ్మెల్యేలపై కూడా అక్రమ కేసులు పెడుతున్నారని ప్రభుత్వ వైఖరిని ఆయన దుయ్యబట్టారు. ‘‘జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాతో పాటుగా ప్రయాణించి నన్ను కడపలో దించి ఉదయం నుంచీ నాతోనే ఉండి తిరుపతికి వెళ్లారు.
 
ఆ రోజు వాళ్లు తిరుమలేశుని దర్శనానికి కూడా వెళ్లారు.. తీరా రాత్రి 8 గంటలపుడు చెవిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టారు’’ అని జగన్ గుర్తుచేశారు. గొట్టుముక్కల (కృష్ణా జిల్లా)లో ఒకే రోజు మూడు సంఘటనలు జరిగితే పోలీసులు అసలు పట్టించుకోలేదని, అక్కడే హత్య జరిగిందని పేర్కొన్నారు. తాను అక్కడకు వెళ్లి ఆ అంశంపై గట్టిగా జోక్యం చేసుకున్న తరువాతనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు.
 
అబద్ధాలని తెలిసినా పదేపదే ఆరోపణలు..
‘‘2004 - 2009 మధ్య కాలంలో జరిగిన హత్యలను వారు (టీడీపీ వారు) కూడా ప్రస్తావిస్తున్నారు కదా! పరిటాల రవి హత్యకు సంబంధించి మీపై ముఖ్యమంత్రి కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా!’’ అని ఒక విలేకరి ప్రశ్నించినపుడు జగన్ తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉందా..? రవి కేసును కోర్టు విచారించింది. దోషుల కు శిక్ష కూడా వేసింది. అయినా చంద్రబాబు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయనకూ తెలుసు.అయినా చెప్తూనే ఉంటారు. అవి నిజమే అయితే జె.సి.దివాకర్‌రెడ్డి, జె.సి.ప్రభాకర్‌రెడ్డి సోదరులను తన పార్టీలో చేర్చుకుని ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎలా టికెట్లు ఇస్తారు? అబద్ధాలు అని తెలిసినా పదే పదే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.

ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేయాలి. అదేపనిగా ప్రచారం చేస్తున్న మీడియాపై కూడా దావా వేయాలి’’ అని మండిపడ్డారు. ‘‘వంగవీటి రంగా హత్యపై అప్పట్లో సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? రంగాను చంద్రబాబే చంపించారని ఆనాడు అందరూ అన్నారు కదా...!’’ అని ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు ఎవరో, రామోజీరావు ఎవరో, రాధాకృష్ణ ఎవరో కూడా నాకు తెలియదు. వారితో పరిచయం గాని, వైరం గాని లేదు. మనిషి రాక్షసుడుగా మారడానికి ఒక లైన్ ఉంటుంది. దానిని దాటి వాళ్లు ప్రవర్తిస్తున్నారు. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? వాళ్లు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు’’ అని జగన్ ఘాటుగా స్పందించారు.
 
రుణాలన్నీ మాఫీ చేయాల్సిందే

సాక్షి, హైదరాబాద్:  ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా రూ. 1.02 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చెప్పా రు. సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత జగన్ లాబీల్లోని తన చాంబర్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘రుణ బకాయీలు మొత్తం 1.02 లక్షల కోట్ల రూపాయలున్నాయని ఎన్నికలకు ముందు తనకు తెలియదని చంద్రబాబు అనడం సరికాదు.
 
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో (ఎస్‌ఎల్‌బీసీల్లో) 181, 182, 183వ సమావేశాల్లో బ్యాంకర్లు స్పష్టంగా వ్యవసాయ రుణాల బకాయిలకు సంబంధించి లెక్కలు తేల్చిచెప్పారు. ఎన్ని లక్షల కోట్ల బ కాయీలున్నదీ ఇచ్చారు. ఇవన్నీ తెలిసిన తరువాతే బాబు ఎన్నికల్లో మొత్తం రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మాట ఆయన తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. రుణ మాఫీపై ఎలా మాఫీ చేయాలో తెలుసుననీ చెప్పారు. రుణ మాఫీపై రెండు రోజుల్లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తారో తెలి యాల్సి ఉంది. రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.  
 
బీఏసీపై ప్రభుత్వం మొండి వైఖరి
బీఏసీ సమావేశానికి వెళ్లి తమకు తక్కువ ప్రాతినిధ్యం కల్పించడంపై నిరసన వ్యక్తం చేశామని, ప్రభుత్వం మరీ మొండిగా వ్యవహరిస్తోందని జగన్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘బీఏసీకి హాజరయ్యే విషయంలో మీ వైఖరిని మార్చుకున్నట్లేనా?’ అని అడుగగా.. ‘‘లేదు, వెళ్లి మా నిరసనను వ్యక్తం చేశాం. ఐదేళ్ల తరువాత వాళ్లు ఇటు రావచ్చు, మేం అటు పోవచ్చు’’ అని వ్యాఖ్యానించారు.
 
 మానవత్వంతో వ్యవహరిస్తాం...
‘ఖాళీ అయిన నందిగామ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మృతి చెందిన తంగిరాల ప్రభాకర్ కుటుంబీకులకే ఏకగ్రీవంగా వదలి వేసే విషయంలో చర్చలేమైనా మొదలయ్యాయా?’ అని ప్రశ్నించగా.. ‘‘లేదు. మరణించిన వారి కుటుంబీకుల పట్ల మాకన్నా మానవతా దక్పథంతో వ్యవహరించే వారుండరు’’ అని జగన్ జవాబిచ్చారు. ‘వ్యవసాయ రుణాలపై అసెం బ్లీలో నిలదీస్తామని చెప్పి, ఇపుడు శాంతిభద్రతలపై చర్చ కావాలంటూ వ్యూహం మార్చారేం?’ అని ప్రశ్నించినపుడు.. ‘ఎవరన్నారు అలాగని..? మీరే రాసుకుంటారు.. తరువాత కాదంటారు. రాష్ట్రంలో మీడియా వర్గాలుగా చీలిపోయింది. నేనొకటి చెప్తే మీరొకటి రాస్తా రు. టీవీ కెమెరాలున్నపుడు మాట్లాడితే ‘సాక్షి’ కూడా ఉంటుంది కనుక నేనేం మాట్లాడానో రుజువు ఉంటుంది’’ అని జగన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement