
'బీఫామ్ ఇవ్వకపోతే దూకేస్తా..'
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పటాన్‌చెరు 113వ డివిజన్‌కు సంబంధించి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి శ్రీధర్ చారికి బీఫార్మ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఓ యువకుడు సోమవారం సాయంత్రం హై టెన్షన్ విద్యుత్ తీగలు గల టవర్ ఎక్కి దూకుతానని బెదిరిస్తున్నాడు.
మెదక్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పటాన్‌చెరు 113వ డివిజన్‌కు సంబంధించి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి శ్రీధర్ చారికి బీఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఓ యువకుడు సోమవారం సాయంత్రం హై టెన్షన్ విద్యుత్ తీగలు గల టవర్ ఎక్కి దూకుతానని బెదిరింపులకు దిగాడు. జాతీయ రహదారిపై నుంచి వెళ్తున్నవాళ్లు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక రామచంద్రాపురం మండలం బండ్లగూడకు చెందిన ఖదీర్(28) అనే యువకుడు టీఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో తమ నాయకుడు శ్రీధర్ చారిని కాదని మరొకరికి బీఫామ్ ఇస్తే.. తాను ఇక్కడి నుంచి దూకి చస్తానని రామచంద్రాపురంలోని విద్యుత్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని కిందకు దించడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా జనాలు గుమిగూడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.