వడదెబ్బకు ఉద్యోగి మృతి | Young man killed with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు ఉద్యోగి మృతి

Apr 24 2016 1:33 PM | Updated on Sep 4 2018 5:21 PM

భానుడి ప్రతాపానికి జనం పిట్టల్లా రాలుతున్నారు.

భానుడి ప్రతాపానికి జనం పిట్టల్లా రాలుతున్నారు. తాజాగా.. చంపాపేట రెడ్డిబస్తీకి చెందిన ఓ యువకుడు వడదెబ్బ కారణంగా మృతి చెందాడు. బీమ్‌నెట్ బంజారాహిల్స్ కార్యాలయంలో టీమ్‌హెడ్‌గా పనిచేస్తున్న కాశీపురం రాఘవేంద్రరావు (34) శనివారం ఎండలో బంజారాహిల్స్‌లోని కార్యాలయానికి వెళ్లాడు. కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో కార్యాలయంలో సిబ్బంది కొబ్బరి బోండా నీరు ఇచ్చి తిరిగి ఇంటికి పంపించేశారు.

 అర్ధరాత్రి అపస్మారక స్థితికిలోకి వెళ్లిన రాఘవేంద్రరావును కుటుంబ సభ్యులు మొదట స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ఆదివారం మృతి చెందాడు. రాఘవేంద్ర వివాహం జరిగి నెల రోజులు అయినట్లు సమాచారం. దీంతో మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది. 

Advertisement
 
Advertisement
Advertisement