బైక్‌ను ఢీకొన్న లారీ.. మహిళ మృతి | women died in road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న లారీ.. మహిళ మృతి

Jul 23 2016 10:17 PM | Updated on Apr 3 2019 7:53 PM

మృతి చెందిన సంధ్యారాణి - Sakshi

మృతి చెందిన సంధ్యారాణి

ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ప్రైవేట్‌ ఉద్యోగిని మృతి చెందింది.

జీడిమెట్ల: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ప్రైవేట్‌ ఉద్యోగిని మృతి చెందింది. జీడిమెట్ల ఎస్సై సైదిరెడ్డి కథనం ప్రకారం..  జీడిమెట్ల విలేజ్‌కు చెందిన వెంకటేశ్వరరాజు కుమార్తె తంగెళ్ల సంధ్యారాణి(25) గ్లోబల్‌ లాజిక్‌ సంస్థలో ఉద్యోగి. శనివారం మధ్యాహ్నం ఆమె షాపూర్‌నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై జీడిమెట్ల పేజ్‌–1 పైపులైన్‌ రోడ్డు మీదుగా ఇంటికి తిరిగి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ( నెంబర్: ఏపీ 09 ఎక్స్‌ 5935) ఢీకొట్టింది. కిందపడిపోయిన సంధ్యారాణి తలపై నుంచి లారీ ముందు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement