మీర్‌పేటలో ఇసుక లారీ బీభత్సం | women died in lorry accident | Sakshi
Sakshi News home page

మీర్‌పేటలో ఇసుక లారీ బీభత్సం

Sep 6 2017 3:28 PM | Updated on Sep 4 2018 5:29 PM

నగరంలోని మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది

హైదరాబాద్‌: నగరంలోని మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. స్థానిక పరిమళ నగర్‌లో ఓ ఇసుక లారీ(టీఎస్‌ 30 టీ 2115) అదుపుతప్పి బైక్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణ అనే తాపీ మేస్త్రీ చంపాపేట్‌ నుంచి తిరుమలనగర్‌కు ఓ మహిళను కూలి పనికి తీసుకెళ్తుండగా.. విజ్ఞానపురి కాలనీ టర్నింగ్‌ దగ్గర లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌ పై వెనుక కూర్చొని ఉన్న కృష్ణవేణి(35) మృతి చెందగా.. కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరారీలో ఉన్న లారీ డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.      
 

Advertisement
 
Advertisement
Advertisement