వైఎస్ఆర్ సీపీకి సంపూర్ణ మద్దతు: కాపునాడు | We will support toYSR Congress Party, says Kapunadu State Convener | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీకి సంపూర్ణ మద్దతు: కాపునాడు

May 3 2014 11:43 AM | Updated on Jul 25 2018 4:09 PM

కాపు కులస్థులకు న్యాయం చేసింది దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే అని ఏపీ కాపునాడు రాష్ట్ర కన్వీనర్ డా.ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు.

కాపు కులస్థులకు న్యాయం చేసింది దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే అని ఏపీ కాపునాడు రాష్ట్ర కన్వీనర్ డా.ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం హైదరాబాద్లో డా.ఎస్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... కాపు సామాజికవర్గ విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ ఇచ్చిన ఘనత వైఎస్దే అని ఆయన స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు వైఎస్ఆర్ నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. కాపులను అన్ని రంగాల్లో మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని వెంకటేశ్వరరావు అభివర్ణించారు. కాపులకు రిజర్వేషన్పై ఏర్పాటు చేసిన జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ను బుట్టదాఖలు చేసింది చంద్రబాబేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ వెంటే కాపు సామాజిక వర్గమంతా ఉంటుందని తెలిపారు. అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  సముచిత స్థానం కల్పిస్తే... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం తమ కులస్థులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఏపీలో వైఎస్ఆర్ సీపీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement