‘విలేజ్‌ వినాయకుడు’ | "Village Ganesha ' | Sakshi
Sakshi News home page

‘విలేజ్‌ వినాయకుడు’

Sep 14 2016 10:39 PM | Updated on Sep 4 2017 1:29 PM

కథానాయిక శ్రియా శర్మ తదితరులు

కథానాయిక శ్రియా శర్మ తదితరులు

రెడ్‌ ఎఫ్‌ఎం 93.5 ఆధ్వర్యంలో ‘విలేజ్‌ వినాయకుడు’ పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

సాక్షి, సిటీబ్యూరో: రెడ్‌ ఎఫ్‌ఎం 93.5 ఆధ్వర్యంలో ‘విలేజ్‌ వినాయకుడు’ పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. విరాళాలు సేకరించి స్వచ్ఛంద సంస్థలకు అందజేసి... ఆ నిధులతో చిలుకూరు సమీపంలోని ఒక బడిని దత్తతకు తీసుకొని... దాన్ని పునరుద్ధరించడం ద్వారా చిన్నారుల నవ్వులకు కారణం కావాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోందన్నారు. ప్రముఖ నటులు ఎన్టీఆర్, సినీ ప్రముఖులు కొరటాల శివ, అవసరాల శ్రీనివాస్, విజయ్‌ దేవరకొండ, రెజీనా, నాని తదితరులు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారన్నారు. చిలుకూరు దేవస్థానం సమీపంలో జరిగిన రెడ్‌ ఎఫ్‌ఎం ‘విలేజ్‌ వినాయకుడు’ ఉత్సవాలకు ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ కుమారుడు రోషన్‌ హీరోగా నటించిన ‘నిర్మలా కాన్వెంట్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శ్రియాశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారని చెప్పారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement