'సోనియాపై కక్ష సాధించాల్సిన అవసరం లేదు' | venkaiah naidu takes on congress party leaders | Sakshi
Sakshi News home page

'సోనియాపై కక్ష సాధించాల్సిన అవసరం లేదు'

Dec 20 2015 1:46 PM | Updated on Mar 18 2019 7:55 PM

'సోనియాపై కక్ష సాధించాల్సిన అవసరం లేదు' - Sakshi

'సోనియాపై కక్ష సాధించాల్సిన అవసరం లేదు'

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కక్ష సాధించాల్సిన అవసరం బీజేపీకి లేదని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కక్ష సాధించాల్సిన అవసరం బీజేపీకి లేదని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ తన నివాసంలో వెంకయ్యనాయుడు విలేకర్లతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసుతో ప్రభుత్వానికేం సంబంధమని ఆయన ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర మోదీని అప్రతిష్టపాలు చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులుపై వెంకయ్య మండిపడ్డారు. పార్లమెంట్ను అడ్డుకుని ప్రజలను మంచి జరగకుండా చేస్తున్నారని ఆ పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. బెయిల్ ఇస్తే సంబరాలు ఎందుకు అని కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement