క్రీడా మైదానంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిల్వ ఉంచిన స్టీల్‌ను దొంగలించిన ఇద్దరు యువకులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
క్రీడా మైదానంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిల్వ ఉంచిన స్టీల్‌ను దొంగలించిన ఇద్దరు యువకులను శాలిబండ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.....పూలబండ క్రీడా మైదానంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిల్వ ఉంచిన మూడు టన్నుల స్టీల్‌ను మేకలబండ ప్రాంతానికి చెందిన కృష్ణ (27), రఘు(21)లు ఈ నెల 4వ తేదీన దొంగిలించారు. 8వ తేదీన కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.లక్ష విలువజేసే స్టీల్‌ను స్వాధీనం చేసుకున్నారు.