రాహుల్ రక్తంలోనే దేశభక్తి: ఉత్తమ్ | tpcc president uttamkumar reddy fires on fir filed against rahul gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్ రక్తంలోనే దేశభక్తి: ఉత్తమ్

Mar 1 2016 3:01 AM | Updated on Sep 19 2019 8:44 PM

రాహుల్ రక్తంలోనే దేశభక్తి: ఉత్తమ్ - Sakshi

రాహుల్ రక్తంలోనే దేశభక్తి: ఉత్తమ్

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై హైదరాబాద్‌లో దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై హైదరాబాద్‌లో దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, నిరంజన్, కార్తీక్‌రెడ్డితో కలసి ఆయన గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. చీప్ పబ్లిసిటీ కోసమే రాహుల్‌పై ఫిర్యాదు చేశారన్నారు.

రాహుల్‌గాంధీ రక్తంలోనే దేశభక్తి, త్యాగం ఉన్నాయని, దేశం కోసం నెహ్రూ, ఇందిరా, రాజీవ్ చేసిన త్యాగాలను, పోరాటాలను దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని ఉత్తమ్ అన్నారు. రాహుల్‌పై కేసు వేసిన వ్యక్తి గతంలో ఏబీవీపీ, బీజేపీలో పనిచేసి ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉన్నారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు దేశభక్తి లేదని, స్వాతంత్య్ర పోరాట సమయంలో కూడా అది బ్రిటిష్ వారికి మద్దతుగా పనిచేసిందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement