అర్ధరాత్రి హీరో, అతడి స్నేహితులు హల్చల్ | Tollywood hero and his friends halchal in jubilee hills | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి హీరో, అతడి స్నేహితులు హల్చల్

Feb 8 2015 10:16 AM | Updated on Sep 26 2018 6:32 PM

అర్ధరాత్రి హీరో, అతడి స్నేహితులు హల్చల్ - Sakshi

అర్ధరాత్రి హీరో, అతడి స్నేహితులు హల్చల్

టాలీవుడ్ ప్రముఖ యువహీరో తన మిత్రులతో కలిసి శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్లోని రహదారిపై హల్చల్ చేశాడు.

హైదరాబాద్:  టాలీవుడ్ ప్రముఖ యువహీరో తన మిత్రులతో కలిసి శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్లోని రహదారిపై హల్చల్ చేశాడు. ఆర్థరాత్రి రహదారిపై గొడవేంటంటూ స్థానికులు హీరో ఆయన మిత్రులను ప్రశ్నించారు. దాంతో వారు రెచ్చిపోయారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా ? అంటూ స్థానికులపై వారు దౌర్జన్యానికి దిగారు. వారి మధ్య తోపులాట చోటు చేసుకుంది. అంతలో అక్కడే నివాసం ఉంటున్న ఐపీఎస్ ఉన్నతాధికారి వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు.

పోలీసులు జూబ్లిహిల్స్ చేరుకుని... స్థానికులను శాంత పరిచి.. హీరో అతడి స్నేహితులను మందలించారు. అనంతరం వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ ఘటనలో యువ హీరోతోపాటు మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కుమారులు ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement