పాలవ్యాన్ బీభత్సం : ముగ్గురు మృతి | three killed in road accident in shamirpet | Sakshi
Sakshi News home page

పాలవ్యాన్ బీభత్సం : ముగ్గురు మృతి

Nov 14 2015 8:21 AM | Updated on Aug 30 2018 3:56 PM

శామీర్పేటలోని జవహర్నగర్లో శనివారం పాలవ్యాన్ బీభత్సం సృష్టించింది.

హైదరాబాద్ : శామీర్పేటలోని జవహర్నగర్లో శనివారం పాలవ్యాన్ బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న వ్యాన్ అదుపు తప్పి బస్స్టాప్లోకి దూసుకెళ్లింది. బస్సు కోసం వేచిన ఉన్న వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement