మున్సిపల్ ఎన్నికలకూ, కలెక్టర్‌కూ ఎలాంటి సంబంధమూ లేకపోయినా మేయను ఎంపిక చేసేది మాత్రం కలెక్టరే.
నగర పాలక సంస్థకు ప్రథమ పౌరుడు మేయర్. అలాంటి వ్యక్తి ఎంపిక మున్సిపల్ చట్టం నిబంధనల ప్రకారం జరుగుతుంది. ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికలకూ, కలెక్టర్‌కూ ఎలాంటి సంబంధమూ లేకపోయినా మేయను ఎంపిక చేసేది మాత్రం కలెక్టరే. మున్సిపల్ యాక్ట్ 1955 సెక్షన్ 90 ప్రకారం ఎంపిక విధానం జరుగుతుంది. ప్రక్రియలో కలెక్టర్‌తో పాటు జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ కార్యదర్శి కూడా పాల్గొంటారు. మూడు జిల్లాలకు సంబంధించి డివిజన్లు ఉన్నా.. హైదరాబాద్ కలెక్టర్ పరిధిలో ఎక్కువ డివిజన్లు వస్తాయి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. నిర్ణయించుకున్న వేదికలో అన్ని పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులను ఆహ్వానిస్తారు. మేయర్ ఎంపిక మెజారిటీని చేతులు పెకైత్తే (షో హాండ్స్) సభ్యుల సంఖ్యను బట్టే నిర్ణయిస్తారు.