వ్యక్తి అదృశ్యం | The disappearance of a person | Sakshi
Sakshi News home page

వ్యక్తి అదృశ్యం

Nov 29 2015 8:41 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం ఎస్సై గణేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా కోడకండ్ల మండలం వ డ్డెకొత్తపల్లి ప్రాంతానికి చెందిన యాకయ్య (40) తన భార్య ఎల్లమ్మతో కలిసి ఇటీవల పాతబస్తీ బీబీబజార్‌లో నివాసముండే బావమరిది ఇంటికి వచ్చాడు.


కాగా ఈ నెల 24వ తేదీన రాత్రి 8.45 గంటల సమయంలో హోటల్‌లో తినుబండారాలు తీసుకొస్తానని చెప్పి వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంట సభ్యులు సాధ్యమైన్నీ ప్రాంతాల్లో వాకబు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో భార్య ఎల్లమ్మ మొఘల్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement