తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని 47 ప్రభుత్వ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఈనెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి బి.శేషుకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని 47 ప్రభుత్వ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఈనెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి బి.శేషుకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. 27న ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్షలను అన్ని రెవెన్యూ డివిజన్‌లలోని 131 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ పరీక్షకు 28,476 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ వెబ్‌సైట్ నుంచి (http://tsrjdc.cgg.gov.in) డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. అభ్యర్థులు హాల్‌టికెట్, బాల్ పాయింట్ పెన్నుతో ఉదయం 10.15 గంటలలోపు పరీక్ష కేంద్రాల లోపలికి వెళ్లాలని సూచించారు.