తెలంగాణలో మరిన్ని కొలువులు వచ్చేశాయ్ | Telangana government release notification for posts | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరిన్ని కొలువులు వచ్చేశాయ్

May 1 2016 2:42 AM | Updated on Jul 11 2019 8:43 PM

తెలంగాణలో మరిన్ని కొలువులు వచ్చేశాయ్ - Sakshi

తెలంగాణలో మరిన్ని కొలువులు వచ్చేశాయ్

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోలకు అవకాశాల కోసం చర్యలు తీసుకుంటుంది.

మూడు శాఖల్లో 1,477 పోస్టులు భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
 
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు మరో శుభవార్త. మూడు శాఖల్లో మొత్తం 1,477 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శనివారం నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ శాఖలో 1,000 గ్రేడ్-2 విస్తరణాధికారి (ఏఈవో) పోస్టులకు, రవాణాశాఖలో 137 ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులు, ఎక్సైజ్ శాఖలో 340 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇచ్చింది.

ఏఈవో పోస్టులకు మే 19 వరకు, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు మే 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఏఈవో పోస్టులకు జూన్ 4న రాతపరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. కానిస్టేబుల్ పోస్టులకు రాతపరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటి స్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అర్హతలు, ఇతర వివరాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో సంప్రదించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement