నానక్‌రాంగూడ బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం | telangana government 10 lakh Ex-gratia for Nanakramguda death victim families | Sakshi
Sakshi News home page

నానక్‌రాంగూడ బాధిత కుటుంబాలకు సాయం

Dec 26 2016 6:54 PM | Updated on Sep 4 2017 11:39 PM

‘నానక్‌రాంగూడ’ బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది.

హైదరాబాద్‌ : నానక్‌రాం గూడ ప్రమద ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఈ దుర్ఘటనలో చనిపోయిన మొత్తం 11మంది కుటుంబాలకు డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్‌, పద్మారావు తదితరులు పరిహారం అందచేశారు. మృతి చెందిన తొమ్మిది కుటుంబాలకు రూ.10.20లక్షలు, ఇద్దరు మైనర్ల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున సాయం అందించారు. కాగా ఈ నెల 8న నానక్‌రామ్‌గూడాలో  నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో మొత్తం 11మంది మృతిచెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement