త్వరలో సినిమా అవార్డుల వేడుక: తలసాని | telangana cabinet sub committee meeting on cinema industry development in secretariat | Sakshi
Sakshi News home page

త్వరలో సినిమా అవార్డుల వేడుక: తలసాని

Feb 11 2016 6:43 PM | Updated on Aug 13 2018 4:19 PM

త్వరలో సినిమా అవార్డుల వేడుక: తలసాని - Sakshi

త్వరలో సినిమా అవార్డుల వేడుక: తలసాని

త్వరలో సినిమా అవార్డుల వేడుకను ఏర్పాటు చేస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు.

హైదరాబాద్ : త్వరలో సినిమా అవార్డుల వేడుకను ఏర్పాటు చేస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ భేటీలో తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ... నంది అవార్డుల పేరు మార్చే ప్రతిపాదన ఉందని తెలిపారు.

2011 నుంచి పెండింగ్లో ఉన్న అవార్డులను అందిస్తామన్నారు. సినిమా షూటింగ్లకు సింగిల్ విండో అనుమతులు ఇస్తామని తలసాని స్పష్టం చేశారు. చిత్రపురి కాలనీలో 10 వేల మందికి ఇళ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. థియేటర్లలో రోజుకు 5 సినిమాల అంశాన్ని పరిశీలిస్తున్నామని తలసాని పేర్కొన్నారు.  ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావుతోపాటు సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, కేఎస్ రామారావు, రాజేంద్ర ప్రసాద్, అశోక్ కుమార్, ఆర్ నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement