సీజేతో టీ బార్ అసోసియేషన్ సభ్యుల భేటీ | telangana bar association members met supreme court chief justice | Sakshi
Sakshi News home page

సీజేతో టీ బార్ అసోసియేషన్ సభ్యుల భేటీ

Jul 3 2016 1:11 PM | Updated on Sep 2 2018 5:24 PM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా న్యాయాధికారుల సస్పెన్షన్ను రీకాల్ చేయాల్సిందిగా వారు సీజేను కోరారు. అయితే ఈ వ్యవహారంలో.. సమ్మె విరమించాల్సిందిగా బార్ అసోసియేషన్ సభ్యులను సీజే కోరారు. న్యాయవాదులు ఆందోళనకరమైన పరిస్థితులు సృష్టించొద్దని ఆయన సూచించారు.

హైకోర్టు విభజనపై కేంద్ర మంత్రి సదానంద గౌడతో మాట్లాడుతానని తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులకు సీజే తెలిపారు. అయితే.. సమ్మె విరమించిన తరువాతే ఈ వ్యవహారంలో తాను జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సీజే తేల్చి చెప్పారు. సమ్మె విరమించే విషయంలో సభ్యులందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బార్ అసోసియేషన్ సభ్యులు సీజేకు వెల్లడించినట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement