ఎమ్మెల్సీల గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కె జానారెడ్డి, షబ్బీర్ అలీ ఆరోపించారు.
హైదరాబాద్ : ఎమ్మెల్సీల గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కె జానారెడ్డి, షబ్బీర్ అలీ ఆరోపించారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బుధవారం హైదరాబాద్లో కె జానారెడ్డి, షబ్బీర్ అలీ స్పందించారు. టీఆర్ఎస్ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడినా.. రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్నామని తెలిపారు. సందర్భాన్ని బట్టి ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని వారు స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ, లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై ఇప్పుడే చెప్పలేమని జానారెడ్డి, షబ్బీర్ అలీ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారని వారు విమర్శించారు.