
సాక్షి,కామారెడ్డి జిల్లా : మంత్రుల కాన్వాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ సభ ప్రాంగణ స్థలాన్ని పరిశీలించేందుకు తెలంగాణ మంత్రులు వెళ్లారు.
ఈ క్రమంలో కొత్త బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షబ్బీర్ అలీ వాహనం టైర్ పేలింది. ఆ వాహనంలో షబ్బీర్ అలీ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.