జేఎన్‌టీయూలో విద్యార్థుల భారీ ధర్నా | students dharna in jntu | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూలో విద్యార్థుల భారీ ధర్నా

Dec 3 2016 12:18 PM | Updated on Sep 4 2017 9:49 PM

సమస్యలు పరిష్కరించాలంటూ కూకట్‌పల్లి జేఎన్‌టీయూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలంటూ కూకట్‌పల్లి జేఎన్‌టీయూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పెంచిన పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించాలని, హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం తరగతులు బహిష్కరించారు. యూజీసీ నిధుల దుర్వినియోగమయ్యాయని, ఇందులో అధికారుల వాటా ఎంత అని ప్రశ్నించారు. విద్యార్థుల నినాదాలతో యూనివర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది.
 

Advertisement
 
Advertisement
Advertisement