డెంగీతో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి | student killed due to dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి

Oct 29 2016 2:06 PM | Updated on Nov 9 2018 4:36 PM

డెంగీ జ్వరం బారిన పడి ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి చెందింది.

హైదరాబాద్: డెంగీ జ్వరం బారిన పడి ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన నగరంలోని వనస్థలిపురం సాయబ్‌నగర్ పద్మావతి కాలనీలో శనివారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన ప్రియ(19) స్థానిక కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది. గత వారం రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికి మృతి చెందింది

Advertisement
 
Advertisement
Advertisement