ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య | SPF constable commits suicide in hyderabad | Sakshi
Sakshi News home page

ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Nov 12 2014 12:04 PM | Updated on Mar 19 2019 5:52 PM

తెలంగాణ సెక్రటేరియట్‌లో పని చేస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ వీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ : తెలంగాణ సెక్రటేరియట్‌లో పని చేస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ వీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. విషం తాగి అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యం కారణంగానే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అధికారుల వేధింపుల వల్లే ప్రకాష్ వీర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు.

కాగా ప్రకాష్ వీర్ మంగళవారం భార్యకు ఫోన్ చేసి ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నానని... ఉద్యోగం చేయలేకపోతున్నానని చెప్పినట్లు సమాచారం. పోలీసులు ప్రకాష్ వీర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement