breaking news
prakash veer
-
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్ : తెలంగాణ సెక్రటేరియట్లో పని చేస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రకాష్ వీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. విషం తాగి అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యం కారణంగానే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అధికారుల వేధింపుల వల్లే ప్రకాష్ వీర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. కాగా ప్రకాష్ వీర్ మంగళవారం భార్యకు ఫోన్ చేసి ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నానని... ఉద్యోగం చేయలేకపోతున్నానని చెప్పినట్లు సమాచారం. పోలీసులు ప్రకాష్ వీర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. -
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య