రూ. 40 కోట్ల హెరాయిన్‌తో అడ్డంగా బుక్కైన పోలీసు | Punjab Cop On Anti Trafficking Duty Arrested With Heroin Worth Rs 40 Crore | Sakshi
Sakshi News home page

రూ. 40 కోట్ల హెరాయిన్‌తో అడ్డంగా బుక్కైన పోలీసు

Oct 14 2026 5:32 PM | Updated on Oct 14 2026 5:41 PM

Punjab Cop On Anti Trafficking Duty Arrested With Heroin Worth Rs 40 Crore

పంజాబ్ సరిహద్దులో డ్రగ్స్ స్మగ్లింగ్‌ను అరికట్టాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ స్వయంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం కలకలం రేపింది. కంచే చేను మేసిన చందంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసే భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ల ద్వారా జరిగే మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ను అరికట్టే బాధ్యతల్లో ఉన్న పంజాబ్ పోలీసు కానిస్టేబుల్‌ కరణ్‌దీప్ సింగ్‌ అడ్డంగా బుక్కయ్యాడు.   రూ. 40 కోట్లకు పైగా విలువైన 15 కిలోల హెరాయిన్‌తో తార్న్ తారన్ జిల్లాలో పట్టుబట్టాడు.

నిందితుడు కరణ్‌దీప్ సింగ్‌ సరిహద్దు జిల్లాలోని సరాయ్ అమానత్ ఖాన్ ప్రాంతంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో దొరికిపోయాడు. ఈ మత్తుమందును సరిహద్దు నుంచి తన స్వగ్రామం భుస్సేకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు అధికారులు ఇప్పుడు ఈ హెరాయిన్ సరుకు  ఎక్కడి నుంచి వచ్చింది.  ఎక్కడికి   చేరవేస్తున్నారు అనే విషయాలను ఆరా తీస్తున్నారు.  ఈ స్మగ్లింగ్ కార్యకలాపాల్లో భాగస్వాములైన ఇతరులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి: మీరట్‌ బ్లూ డ్రమ్‌ కేసు : దోషులకు మరణ శిక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement