సికింద్రాబాద్‌లో కారు బీభత్సం | speeding car rams into other vehicles, 4 injured | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌లో కారు బీభత్సం

Dec 10 2016 4:50 PM | Updated on Aug 14 2018 3:22 PM

సికింద్రాబాద్‌లో కారు బీభత్సం - Sakshi

సికింద్రాబాద్‌లో కారు బీభత్సం

సికింద్రాబాద్‌లోని సంగీత్ థియేటర్ వద్ద శనివారం ఓ కారు బీభత్సం సృష్టించింది.

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని సంగీత్ థియేటర్ వద్ద శనివారం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనలో  నాలుగు ద్విచక్ర వాహనాలు, ఓ కారు ధ్వసం అయ్యాయి. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Advertisement
 
Advertisement
Advertisement