హైకోర్టు న్యాయమూర్తులకు ఘన వీడ్కోలు | solid farewell to Justice Candrayya, Justice kantarao | Sakshi
Sakshi News home page

హైకోర్టు న్యాయమూర్తులకు ఘన వీడ్కోలు

Apr 30 2016 4:00 AM | Updated on Aug 31 2018 8:24 PM

హైకోర్టు న్యాయమూర్తులకు ఘన వీడ్కోలు - Sakshi

హైకోర్టు న్యాయమూర్తులకు ఘన వీడ్కోలు

వచ్చే నెల 9న పదవీ విరమణ చేయనున్న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావులకు హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది.

9న పదవీ విరమణ చేయనున్న ఇరువురు న్యాయమూర్తులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 9న పదవీ విరమణ చేయనున్న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావులకు హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. మే 2 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వారిద్దరికీ వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని శుక్రవారమే ఏర్పాటుచేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో సహా న్యాయమూర్తులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావులు తమకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే మాట్లాడుతూ...జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ కాంతారావులు న్యాయవ్యవస్థకు ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరువురు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘాల తరఫున వాటి అధ్యక్షులు సి.నాగేశ్వరరావు, గండ్ర మోహనరావులు ఘనంగా సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement