జనవరి 31లోగా చెల్లించాలి | should pay within january 31 | Sakshi
Sakshi News home page

జనవరి 31లోగా చెల్లించాలి

Jan 20 2018 3:02 AM | Updated on Sep 19 2018 8:25 PM

సాక్షి హైదరాబాద్‌: హజ్‌ యాత్ర–2018కు ఎంపికైన వారు ప్రయాణానికయ్యే ఖర్చులో తొలి వాయిదా రూ. 81 వేలను ఈ నెలాఖరులోగా చెల్లించాలని హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌.ఎ.షుకూర్‌ శుక్రవారం తెలిపారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలోని ఏశాఖ నుంచి అయినా కేంద్ర హజ్‌ కమిటీ పేరుతో చలానా తీయవచ్చన్నారు. రుసుమును ఆన్‌లైన్‌లో కూడా చెల్లించవచ్చన్నారు. హజ్‌ కమిటీ కేటాయించిన నంబర్, బ్యాంక్‌ నిర్థారణ, పాన్‌కార్డు నంబర్లను చలానా తీసేటప్పుడు పేర్కొనాలని చెప్పారు. నగదు రసీదుతో పాటు డ్రా ద్వారా ఎంపికైన వారు తమ ఒరిజినల్‌ పాస్‌పోర్టు, ఫొటోలు, మెడికల్‌ సర్టిఫికెట్‌ను రాష్ట్ర హజ్‌ కార్యాలయంలో ఇవ్వాలన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement