తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో మంత్రుల శాఖల మార్పుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో మంత్రుల శాఖల మార్పుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. మంత్రుల శాఖల మార్పులపై సోమవారం రాత్రి జీవో వెలువడింది. నాలుగు శాఖల మార్పుకు కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ఇక పని భారం పెరిగినందున మైనింగ్ శాఖ నుంచి తనను తప్పించాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరినట్లు సమాచారం.
కేటీఆర్కు-పరిశ్రమలు, మైనింగ్ శాఖలు
జూపల్లి కృష్ణారావు- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
పోచారం శ్రీనివాసరెడ్డి-సహకార శాఖ
తలసాని శ్రీనివాస్ యాదవ్-బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక డెయిరీ డెవలప్మెంట్ శాఖలు.
ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దే వాణిజ్య పన్నులు, గ్రామీణ నీటి సరఫరా (వాటర్ గ్రిడ్) శాఖలు తన వద్దే ఉంచుకున్నారు.