{పమాద సంఘటనలపై శాస్త్రీయ విశ్లేషణ
భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు
మలేషియాలో ప్రత్యేక శిక్షణ పొందిన ఎంవీఐలు
సిటీబ్యూరో: నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాద సంఘటన లు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వాహన చోదకుల తప్పిదాలతో ఇవి సంభవిస్తున్నా...పెద్ద వాహనాల పైనే నేరం మోపడం పరిపాటిగా మారింది. ఈ ప్రమాదం ఎలా? ఎందుకు జరిగింది? తప్పెవరిది? భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై శాస్త్రీయమైన, సమగ్రమైన విశ్లేషణ లోపిస్తోందనే అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి అశాస్త్రీయ ధోరణుల నుంచి బయట పడేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ప్రమాదాలకు కారణాలపై విశ్లేషణ, నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై నూతన ఒరవడికి శ్రీకా రం చుడుతోంది. ఇందులో భాగంగా 10 మంది మోటారు వాహన తనిఖీ అధికారులు మలేషియాలో ప్రత్యేక శిక్షణ పొం దారు. ‘క్రాష్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంజ్యూరీస్ అనాలిసిస్’ అనే అంశంపై ఇటీవల మలేషియాలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ఎంవీఐలు పాల్గొన్నారు.
ఏకపక్ష పద్ధతికి స్వస్తి...
ప్రమాదాలకు కారణాలను విశ్లేషించడం లో ఎంవీఐలు భాగస్వాములు కావడం లేదు. సంఘటనల అనంతరం వాహనం కండీషన్, బ్రేక్‌లు, ఇంజన్ నాణ్యత వంటి అంశాలపైన అధ్యయనం చేసి నివేదికలు రూపొందిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఎంవీఐలకు అవగాహన లోపిస్తోంది. ఫలితంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ, రహదారుల నిర్మాణ పద్ధతులు, డ్రైవింగ్ లోపాలు తదితర అంశాలను కచ్చితంగా విశ్లేషించలేకపోతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వంటి భారీ దుర్ఘటనలు జరిగినప్పుడు మినహా పోలీసు శాఖతో పోల్చితే రవాణా శాఖ ప్రమేయం చాలా తక్కువ. కేవలం వాహనాల సామర్ధ్య విశ్లేషణకే పరిమితం కావడంతో ప్రమాదాలను అరికట్టడంలో ఆశించిన ఫలితాలను సాధించలే మని రవాణా శాఖ గుర్తించింది. ఈ క్రమంలో తెలంగాణ ఎంవీఐ అసోసియేషన్ అధ్యక్షులు పాపారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుప్పాల శ్రీనివాస్‌ల నేతృత్వంలో పదిమంది ఎం వీఐలు ప్రత్యేక శిక్షణ పొందారు. ప్రమా దం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవడం... కారణాలను సమగ్రంగా విశ్లేషించి నివేదికలు రూపొందించడంపై స్పష్టమైన అవగాహన పొందినట్లు పుప్పాల శ్రీనివాస్ చెప్పారు.
విశ్లేషణ ఇలా...
సంఘటన స్థలం, రోడ్డు నిర్మాణంపై అధ్యయనం తప్పనిసరి.
భారీ దుర్ఘటనలు మొదలుకొని చిన్న చిన్న ప్రమాదాలపైనా డేటా బేస్ రూపొందించాలి.
{పమాద సమయంలో వాహనం ఎంత వేగంతో ఉన్నప్పుడు బ్రేకులు వేశారనే అంశం కీలకం.
లభించిన ఆధారాలపై ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో విశ్లేషిస్తారు.
నష్టాన్ని విశ్లేషించడం, నమూనా చిత్రాల రూపకల్పన, ప్రమాదాల వర్గీకరణ వంటి అంశాలపై అధ్యయనం.
ఔటర్ రింగ్ రోడ్డు, హైవేలలో ప్రమాదాలు జరగకుండా పాటించవలసిన రోడ్డు భద్రత నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడం.
ఎందుకు?ఎలా?
Published Thu, Aug 27 2015 12:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement