ఇంగ్లిష్‌లో ‘సాక్షి ఎడ్జ్’ అడ్వాన్స్‌డ్ కోర్సు | sakshi edge providing training for english communication | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌లో ‘సాక్షి ఎడ్జ్’ అడ్వాన్స్‌డ్ కోర్సు

Aug 19 2016 3:08 AM | Updated on Aug 20 2018 8:20 PM

ఇంగ్లిష్‌లో ‘సాక్షి ఎడ్జ్’ అడ్వాన్స్‌డ్ కోర్సు - Sakshi

ఇంగ్లిష్‌లో ‘సాక్షి ఎడ్జ్’ అడ్వాన్స్‌డ్ కోర్సు

కెరీర్‌లో విజయవంతంగా ముందుకు దూసుకెళ్లేందుకు అవసరమయ్యే ‘కమ్యూనికేటివ్ ఇంగ్లిష్’లో అడ్వాన్స్‌డ్ కోర్సును ‘సాక్షి ఎడ్జ్’ అందిస్తోంది.

సాక్షి, హైదరాబాద్: కెరీర్‌లో విజయవంతంగా ముందుకు దూసుకెళ్లేందుకు అవసరమయ్యే ‘కమ్యూనికేటివ్ ఇంగ్లిష్’లో అడ్వాన్స్‌డ్ కోర్సును ‘సాక్షి ఎడ్జ్’ అందిస్తోంది. కెరీర్ సంబంధిత విషయాల్లో విజయం కోసం విలక్షణమైన, ప్రభావవంతమైన శిక్షణా పద్ధతుల ద్వారా ఈ కోర్సును అందజేస్తోంది. ఫొనెటిక్స్ అండ్ ప్రొనన్షియేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ టెక్నిక్స్, రీడింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్, ప్రజెంటింగ్ స్కిల్స్, ప్రిపేరింగ్ ఏ సౌండ్ సీవీ, గ్రీటింగ్ అండ్ ఇంట్రడక్షన్, రిపోర్టు రైటింగ్ వంటి ఎనిమిది అంశాలతో ఈ కోర్సును రూపొందించారు.

30 రోజుల వ్యవధిగల ఈ కోర్సు సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. కోర్సు ఫీజు రూ. 4,600. ప్రతిరోజూ ఉదయం 7.30 గంటల నుంచి 9.30 వరకు తరగతులు నిర్వహిస్తారు. పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు ఉన్నాయి. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం, దరఖాస్తుల కోసం 9603533300 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement